*//పని ఒత్తిడి తట్టుకోలేక ఏడుగురు వాలంటీర్ల రాజీనామా//*
- - - - - - - - - - - - - - - - - - - - - -
☛ అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఏడుగురు వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
☛ పనిఒత్తిడి తట్టుకోలేక శుక్రవారం రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు.
☛ సాధారణంగా ఒక్కో వాలంటీరు 50 గృహాలను పర్యవేక్షిస్తారు. సజ్జలదిన్నె గ్రామంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 వరకు గృహాలు కేటాయించారు. మరోవైపు వేతనాలు కూడా సకాలంలో అందడం లేదని తెలిసింది.
☛ దీనిపై ఎంపీడీవో రంగారావును అడగ్గా పని ఒత్తడి తట్టుకోలేక పోతున్నామని ఏడుగురు వాలంటీర్లు రాజీనామా పత్రాలు కార్యాలయంలో అందించిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే క్లస్టర్లు పెంచి వాలంటీర్లను నియమించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని సర్దిచెప్పినట్లు తెలిపారు.
☛ రాజీనామాలను ఆమోదించలేదని ఎంపీడీవో పేర్కొన్నారు.
Source : Eenadu(11.09.2022)
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection
Exam ki marks weightage ichi DA post ki recruit chesthe better.
Mahila police post icharu kani adi only ladies ke kada