🔴 *సిటిజెన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ లో గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నిర్వహించవలసిన బాధ్యతలు*
1⃣. సిటిజెన్ ఔట్రీచ్ క్యాంపెయిన్ లో భాగంగా గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది వారి పరిధి లోని కుటుంబాలను సంబంధిత గ్రామ/ వార్డు వాలంటీర్ తో పాటుగా సందర్శించవలెను. క్యాంపెయిన్ నిర్వాహకుని గా ప్రజలకు పరిచయం చేసుకోవలెను.
2⃣. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహణలో పాల్గొనే సిబ్బంది వారి మరియు సంబంధిత ఇతర కార్యదర్శులు నిర్వర్తించవలసిన విధులు మరియు బాధ్యతలను వివరించవలెను.
3⃣. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ గురించి ప్రజలకు వివరించవలెను.
4⃣. సిటిజన్ ఔట్ రీచ్ క్యాంపెయిన్ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించి, గ్రామ/ వార్డు సచివాలయం లో లభించే విభిన్న ప్రభుత్వ సేవలను ఉపయోగించుకోవలసినదిగా ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయవలెను.
5⃣. ప్రభుత్వ సంక్షేమ పథకాల క్యాలెండర్ మరియు సచివాలయ సిబ్బంది యొక్క వివరాలతో కూడిన ప్రజలందరికీ అందజేయవలెను.
6⃣. గ్రామ/ వార్డు వాలంటీర్ల పనితీరు పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవలెను.
7⃣. యాప్ లో ప్రశ్నావళిని గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది పూర్తి చేయవలెను.
8⃣. ప్రభుత్వ పథకాలు మరియు సేవల దరఖాస్తు ప్రక్రియలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా సేకరించవలెను.
9⃣. ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం నిరభ్యంతరంగా సచివాలయాన్ని సందర్శించమని కోరాలి. వారి సమస్యల పరిస్కారం కోసం తాము ఉన్నాము అనే భరోసా కల్పించాలి.
🔟. పౌరుల ఫోటోని క్యాప్టర్ చేసి, తమ విలువైన సమయాన్ని కేటాయించి 'ఔట్ రీచ్ కాంపెయిన్' లో పాల్గొని సహకరించినందుకు అభినందిస్తూ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపవలెను.
[ 𝐏𝐃𝐅 కొరకు -
https://bit.ly/3WsGZbi ] #COP
( అందరికి షేర్ చేయండి
👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *
VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )