*//అమరావతిలో భూమి లేని వాలంటీర్ల కుటుంబాలకు పెన్షన్//*

● మార్చి ఒకటో తేదీ నుంచి అమలు
● పురపాలకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి

☛ అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన *గ్రామ వాలంటీర్లుగా* పని చేస్తున్న వారి కుటుంబాలకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

☛ ఇందులో భాగంగా గురువారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.

☛ ఇకపై ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛను రూ.2,500 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

☛ ఇటీవల అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. *ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు.*

☛ వారి కుటుంబాలకు పెన్షన్లు అందించాలని ఆదేశించారు. *అమరావతిలో భూమి లేని సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు శ్రీలక్ష్మి వెల్లడించారు.*

● *Source* : Date: 24/02/2023, Edition: Andhra Pradesh, Page: 2
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

6 comments

MISS sweety
Sir pension kanna Competative exams lo makuu reservation ivvandi sir please please .... Ela pension iste Dane pyna aadharapadatharuu ilantivi kakundaa vastunna Sachivalayam Inka migilina exams anitiloo makuu reservation ivvandi volunteers kiii....
Pension kante salary penchite baguntadi. Volunteer job government cheste valaki baguntadi.
D.V.Meher Abotula
మాకు కావలసినది ఫంక్షన్ కాదు సార్
అవును పెన్షన్ ముఖ్యం కాదు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ముఖ్యం, ఉన్న ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత ముఖ్యమైనది. ఇవి చేయండి తెలివి తక్కువగా పెన్షన్ ఏంటి వికలాంగుల మాదిరిగా సేవకులని పోసిస్తున్నట్టుగా ఉంది
Who Knows
Pension voadhani amaravathi volunteers dharna cheyandi.. Competitive xams lo reservation iste bavuntadhi
Satish Rebel
Este Ap motham evvali gani amaravathi lone na bumi leni volunteers undi? Ap lo inka Yekkada lera? అందరికీ సమన్యాయం చేయండి. పెన్షన్ ఇవ్వడం మానేసి వాలంటీర్ ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కీ రిజర్వేషన్ కల్పించండి.