*/
/అమరావతిలో భూమి లేని వాలంటీర్ల కుటుంబాలకు పెన్షన్//*
● మార్చి ఒకటో తేదీ నుంచి అమలు
● పురపాలకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి
☛ అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన *
గ్రామ వాలంటీర్లుగా* పని చేస్తున్న వారి కుటుంబాలకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
☛ ఇందులో భాగంగా గురువారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.
☛ ఇకపై ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛను రూ.2,500 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.
☛ ఇటీవల అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. *
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు.*
☛ వారి కుటుంబాలకు పెన్షన్లు అందించాలని ఆదేశించారు. *
అమరావతిలో భూమి లేని సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు శ్రీలక్ష్మి వెల్లడించారు.*
● *
Source* : Date: 24/02/2023, Edition: Andhra Pradesh, Page: 2
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]