📰 *దినపత్రిక రసీదు యాప్ లో అప్లోడ్ చేయాల్సిందే*

వాలంటీర్లకు అధికారుల ఆదేశాలు.

*ఈనాడు, అమరావతి:* గ్రామ, వార్డు, వాలంటీర్లు వినియోగించే దినపత్రికకు సంబంధించిన రసీదును వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి నెలా విధిగా అప్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కోవడానికి జులై నుంచి నెలకు రూ.200 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దినపత్రిక తీసుకుని, నెలవారీ బిల్లు చెల్లించాక ఏజెంట్ ఇచ్చే రసీదును ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో కొత్తగా *'న్యూస్ పేపర్ సబ్ క్రిస్క్రిప్షన్*' పేరుతో మరో ఫీచర్ను జత చేశారు. అడగకుండానే ఇళ్లకు సాక్షి దినపత్రిక

వాలంటీర్ల ఇళ్లకు కొన్నిచోట్ల వారిని అడగకుండానే సాక్షి దినపత్రికను పంపడం చర్చనీయాంశమవుతోంది. వారు ఏ పత్రిక కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు. సదరు దినపత్రిక సిబ్బంది. వాలంటీర్ల ఇంటి చిరునామాను సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకుని ఆ పత్రికను చేరవేస్తు న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అభి ప్రాయం తీసుకోకుండా దినపత్రిక వేయడంపై పలు వురు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Date : 26/07/2022 EditionName : ANDHRAPRADESH PageNo: 14

41 comments

Satish Rebel
సాక్షి పేపర్ వాళ్లే సచివాలయం కి వచ్చి అప్లికేషన్ రాసుకుని పేపర్ వేస్తున్నారు.
Mr.Attitude Attitude
Mem adress,pn num echi 15 days avtundi ..maaku raavatla...raani vallu kuda photo upload cheiyyalaa
Sweety
మా సచివాలయంలో సాక్షి వాళ్ళు వచ్చి అడిగి, తెలుసుకుని, అప్లికేషన్లు పట్టికొని వెళ్లారు. మమ్మలి అడగకుండా ఏమి చెయ్యలేదు. ఈ ఈనాడు వాడికి ఇంతే.... 🤦 వాడికి అనుగుణంగా వ్రాసుకొంటాడు.
Sweety
Mr.Attitude Attitude
Mem adress,pn num echi 15 days avtundi ..maaku raavatla...raani vallu kuda photo upload cheiyyalaa
NOOO ఫొటోస్ అనేది ఎవరికి ఐతే bill ఇస్తారో వాళ్లే చెయ్యాలి ఆ తేదీని నమోదు చేసి అనుకుంటాను. కంగారు పడి అప్పుడే చేయద్దు
REBEL
Salaries gurunchi avaru pattinchukora
Bhadram
మాకు ఏమి లేదు అస్సలు
Sweety
REBEL
Salaries gurunchi avaru pattinchukora
అవును అన్న... ముందు మనలో ఐక్యత ఉండలిగా
REBEL
Ade Anto andaru silent 😶 ga untunaru
N Madhuri
మాకు సాక్షి పేపర్ రావడం లేదు... కాల్ చేసాం కానీ వాళ్ళు reply కూడ ఇవ్వడం లేదు ma వైపు అందరికి పేపర్ వస్తుంది.. కానీ మాకు రావట్లేదు...
Prasad Vara yenduri
Adaga kunda vaallu (sakshi) phone lu cheyadam ippudemo direct app lo upload option ivvadam enti salary penchadaniki raaani chetulu Ila aite vastaya
Show next 30 comments