*ఈనాడు, అమరావతి:* గ్రామ, వార్డు, వాలంటీర్లు వినియోగించే దినపత్రికకు సంబంధించిన రసీదును వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో ప్రతి నెలా విధిగా అప్లోడ్ చేయాల్సిందేనని అధికారులు ఆదేశించారు. వాలంటీర్లకు దినపత్రిక కొనుక్కోవడానికి జులై నుంచి నెలకు రూ.200 చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దినపత్రిక తీసుకుని, నెలవారీ బిల్లు చెల్లించాక ఏజెంట్ ఇచ్చే రసీదును ఫొటో తీసి అప్లోడ్ చేయాలని సూచించారు. వాలంటీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్లో కొత్తగా *'న్యూస్ పేపర్ సబ్ క్రిస్క్రిప్షన్*' పేరుతో మరో ఫీచర్ను జత చేశారు. అడగకుండానే ఇళ్లకు సాక్షి దినపత్రిక
వాలంటీర్ల ఇళ్లకు కొన్నిచోట్ల వారిని అడగకుండానే సాక్షి దినపత్రికను పంపడం చర్చనీయాంశమవుతోంది. వారు ఏ పత్రిక కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం లేదు. సదరు దినపత్రిక సిబ్బంది. వాలంటీర్ల ఇంటి చిరునామాను సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో తెలుసుకుని ఆ పత్రికను చేరవేస్తు న్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా, తమ అభి ప్రాయం తీసుకోకుండా దినపత్రిక వేయడంపై పలు వురు వాలంటీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Date : 26/07/2022 EditionName : ANDHRAPRADESH PageNo: 14
R
In mobile
No need for me